ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు మెరుగైన వసతులే ప్రభుత్వ ధ్యేయం
ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు మెరుగైన వసతులే ప్రభుత్వ ధ్యేయం
ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..


ఏర్పేడు, 14 జూన్ (హి.స.) , ఏర్పేడు మండలంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, కందాటి శివశంకరరెడ్డి, బొల్లిని నిరంజన్ బాబు నాయుడు, గాలి కృష్ణవేణి, అశ్వద్ధామ, కేశినేని సుబ్రమణ్యం, గుణా యాదవ్, రాచేటి సుబ్రమణ్యం, కె.కె. రమణ, గణేష్ నాయుడు, రామదాసు, వై. మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నాయకులు ఎమ్మెల్యేతో చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande