
అమరావతి, 15 జూన్ (హి.స.)
సింగపూర్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. కాపిటలిస్టుల రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భారత్ సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థికశక్తి అని అన్నారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించటానికి దశాబ్దాల కాలం పట్టిందని.. కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దేశాన్ని అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మెడికల్ టెక్నాలజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ది అగ్రస్థానమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ