
అమరావతి, 16 జూన్ (హి.స.)
తిరుపతి (సాంస్కృతికం): తిరుపతి పట్టణంలో వెలసిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో గంగాజాతర తరువాత వచ్చే వారాల సందర్భంగా ఐదో వారమైన మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దాతల సహకారంతో ముత్యాల పూసలతో అమ్మను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అదే విధంగా తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో 17వ తేదీన హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఛైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, ఆలయ ఈవో ఎ. జయకుమార్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ