
అమరావతి, 16 జూన్ (హి.స.)
పీఎం పాలెం: యూపీఎస్సీ ప్రిలిమ్స్లో రుషికొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ విద్యార్థులు పి.సాయికిరణ్ (హిందూపురం), తోటకూర మూలస్వామి (కాకినాడ జిల్లా ఏలేశ్వరం) మెయిన్స్కు అర్హత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీరు డిసెంబర్ 29 నుంచి ఇక్కడ శిక్షణ పొందారు. ఇద్దరు యువకులను ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేశ్ (ఐఏఎస్), గురుకులాల విశాఖ జిల్లా సమన్వయ అధికారి జి.గ్రేస్, కో-ఆర్డినేటర్ పి.సత్యనారాయణ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ