విద్యార్ధుల భవిష్యత్తే రాష్ట్ర భవిషత్తుగా , సంపదగా రాష్ట్రం భావిస్తోంది
విద్యార్ధుల భవిష్యత్తే రాష్ట్ర భవిషత్తుగా , సంపదగా రాష్ట్రం భావిస్తోంది
విద్యార్ధుల భవిష్యత్తే  రాష్ట్ర భవిషత్తుగా , సంపదగా రాష్ట్రం భావిస్తోంది


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

, మన విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా, సంపదగా ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం తన పుట్టినరోజును రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నజీబ్నగర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జరుపుకొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ చదువుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పిల్లలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన యూనిఫామ్లు అందిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో డైట్ చార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు పౌష్ఠికాహార లోపంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం 40శాతం డైట్ చార్జీలు 200శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande