విజయనగరం జిల్లాలో అభివృద్ధి సంక్షేమం - జిల్లా స్థాయి.విజయోత్సవ సభ
విజయనగరం జిల్లాలోని. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో
విజయనగరం జిల్లాలో అభివృద్ధి సంక్షేమం - జిల్లా స్థాయి.విజయోత్సవ సభ


విజయనగరం,, 15 జూన్ (హి.స.)

:జిల్లాలోనిపోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ జిల్లా స్థాయి విజయోత్సవ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'డ్రగ్స్ రహిత రాష్ట్రం' థీమ్తో జిల్లాలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నట్లు తెలిపారు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి నడిపించే జిల్లాలని హోం మంత్రి వెల్లడించారు. అతి త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. నిరుద్యోగ యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశంలోనే పింఛనులు అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande