బౌద్ద క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి
బౌద్ద క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి
బౌద్ద క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి


పల్నాడుజిల్లా, 15 జూన్ (హి.స.)

పల్నాడు జిల్లా విజయపురిసౌత్ వద్ద కృష్ణానదిలో ఉన్న నాగార్జునకొండ బౌద్ధక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ 1966 నాటి నిర్మాణాలే తప్ప.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. 1954 నుంచి 1960 వరకు ఈ కొండ సమీపంలో 24 కిలోమీటర్ల వైశాల్యంలో జరిపిన తవ్వకాల్లో 130కి పైగా ప్రాచీన నివాస స్థలాలు, 70కి పైగా నిర్మాణ అవశేషాలు, బుద్ధుడు, ఆయన శిష్యులకు చెందిన ధాతుకరండకాలను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా పెకలించి, ఆ అవశేషాలతో నాగార్జునకొండపైన యథాతథంగా పునర్నిర్మించారు. మిగిలిన వాటిని భద్రపరచడానికి అక్కడే విశాలమైన పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి, ప్రదర్శనకు ఉంచారు.

ప్రస్తుతం విజయపురిసౌత్ నుంచి నాగార్జునకొండకు వెళ్లాలంటే కృష్ణానదిలో 14 కి.మీ. 45 నిమిషాల పాటు లాంచీల్లో ప్రయాణించాలి. కనీసం 30 మంది ఉంటే తప్ప లాంచీ సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు. కొండపై కట్టడాలకు రక్షణ చర్యలు, పర్యాటకులను ఆకట్టుకునేలా మరిన్ని నిర్మాణాలు, సీప్లేన్, మాచర్ల నుంచి విజయపురిసౌత్ వరకు బస్సు, రాత్రి వసతి తదితర సౌకర్యాలు మెరుగుపరిస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande