కదిరి పోలీస్ స్టేషన్ లో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు
కదిరి పోలీస్ స్టేషన్ లో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు
కదిరి పోలీస్ స్టేషన్ లో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు


కదిరి, 15 జూన్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్ లో బిజెపి నేత విష్ణువర్థన్ రెడ్డిపై టిడిపి నేతలు ఈ రోజు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు.

కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పై టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టిడిపి నేతలు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి వైసిపి పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విష్ణువర్ధన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.

గత వైసిపి ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిపై నోరు మెదపని విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ముసుగులో వైసీపీ అధినేత జగన్ కోసం విష్ణువర్ధన్ రెడ్డి పని చేస్తున్నాడని విమర్శించారు.బిజెపికి విష్ణువర్ధన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమి పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande