
తిరుమల, , 15 జూన్ (హి.స.):టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందాయి. కోల్కతాలొరి క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన పదమ్ కుమార్ అగర్వాల్ ఇచ్చిన ఈ విరాళాన్ని ఆయన తరపున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు.
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. వీరికి 18 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు టైంస్లాట్ భక్తులకూ 3 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. శనివారం 92,830 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. గత మూడు రోజుల్లో 1.34 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ