సినీ నటికి లైంగిక వేధింపులు
సినీ నటికి లైంగిక వేధింపులు
సినీ నటికి లైంగిక వేధింపులు


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ఒక సినీ నటిని లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్లో వెలుగుచూసింది. ఓ సినిమా క్యాస్టింగ్ ఆర్టిస్ట్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడంటూ సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ నటికి ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. ఓ మంచి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే, షూటింగ్ పూర్తియినప్పటికీ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మాత్రం చెల్లించలేదు. డబ్బుల విషయం పక్కన పెడితే, తాజాగా ఒక నిర్మాత కార్యాలయానికి రావాలంటూ ఆ నటికి ఫోన్ చేసి పిలిపించాడు.

సదరు వ్యక్తి మాటలు నమ్మి అతను చెప్పిన చోటికి వెళ్లింది. ఇంకా పెద్ద సినిమాలో మంచి మంచి పాత్రలు ఇప్పిస్తానని, పెద్ద అవకాశాలు వచ్చేలా చేస్తానని ప్రలోభపెడుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడు. ఈ పరిణామంతో షాక్ అయిన సదరు నటి.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande