సంధ్య.థియేటర్ పుష్ప 2 తోకిసలాట కేసు ,ఈ నెల.4 నా ఉత్తర్వులు.జారీ
హైదరాబాద్, 15 జూన్ (హి.స.) అల్లు అర్జున్ () హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే! అలాగే శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అల్లు అరవింద్, స్నేహారెడ్డి శ్రీతేజ
సంధ్య.థియేటర్ పుష్ప 2 తోకిసలాట కేసు ,ఈ నెల.4 నా ఉత్తర్వులు.జారీ


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

అల్లు అర్జున్ () హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే! అలాగే శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అల్లు అరవింద్, స్నేహారెడ్డి శ్రీతేజ్ను పలకరించారు. అయితే సంధ్య థియేటర్ కేసులో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వెకేషన్ సివిల్ జడ్జి- అదనపు చీఫ్ జడ్జి ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు అసత్య ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టులు చేయరాదని కోర్టు ఆదేశించింది. దీనితో అల్లు అర్జున్కి సంధ్య థియేటర్ కేస్ విషయంలో ఇబ్బంది కాస్త దూరమైనట్లే. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియా కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి నెగిటివ్ కామెంట్లు, పోస్టుల విషయంలో బన్నీ టీమ్ కాపీ రైట్స్ లేదా టేక్ డౌన్ చేసే వెసులబాటు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande