
గుంతకల్లు ,15 జూన్ (హి.స.)అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన నటువంటి - శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం యందు యోగా ఉత్సవములలో భాగంగా తోమిదవ రోజు సోమవారం 15.06.2026 ఉదయం 7:00 గంటల నుండి 8:00 గంటల వరుకు గుంతకల్ కు చెందిన అంతర్జాతీయ యోగా శిక్షకులు శ్రీ జి.వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో దేవస్థానం ముందు ప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV