
హైదరాబాద్, 15 జూన్ (హి.స.)
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇవాళ వెయ్యికిపైగా స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 150కిపైగా బస్సులపై కేసు నమోదు చేశారు. ఫిట్నెస్ లేని 35 విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్