
కర్నూలు, 15 జూన్ (హి.స.)
కర్నూలు నగరంలో పూడికతీత పనులు ముమ్మరంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
సోమవారం కిడ్స్ వరల్డ్ సర్కిల్, వడ్డేగిరి, బంగారుపేట, గాంధీనగర్, ఆనంద్ టాకీస్ జంక్షన్, సీతారాంనగర్, రామలింగేశ్వర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షం ఎప్పుడు కురిసినా డ్రైనేజీ వ్యవస్థలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా అవసరమైన పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. రూ.2.39 కోట్ల వ్యయంతో 134.28 కిలోమీటర్ల మేర ప్రత్యేక పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV