రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి: పద్మా దేవేందర్ రెడ్డి


మెదక్, 15 జూన్ (హి.స.)

మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలోని దోని కొట్టుకుపోయిందని తెలిపారు. దీంతో ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, అయితే సంవత్సరం గడిచినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్ కొంటూర్ గ్రామాల చెరువులతో పాటు మెదక్ పట్టణంలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా నాయకుని చెరువులు నిండుతాయని తెలిపారు. కాబట్టి వెంటనే కాల్వ మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

అలాగే గత ఏడాది వర్షాలకు పుష్పల వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయిందని, ప్రస్తుతం మట్టితో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారని తెలిపారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande