దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్రెడ్డిపై మోదీ ప్రశంసలు
దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్రెడ్డిపై మోదీ ప్రశంసలు
PM Modi describes the glory of the motherland in a Sanskrit proverb


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ప్రగతి కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిగా ఆయన్ను అభివర్ణించారు. బొగ్గు, గనుల రంగాల బలోపేతానికి కిషన్రెడ్డి చేస్తున్న కృషిని కొనియాడారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. కిషన్రెడ్డి కష్టపడి పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. సంస్కరణలు, విధానపరమైన చర్యల ద్వారా బొగ్గు, గనుల రంగాల్లో మార్పు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని కొనియాడారు. కిషన్రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్న మోదీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కిషన్రెడ్డి సేవలను ప్రశంసించారు. బొగ్గు, గనుల రంగాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ఆయన చేస్తున్న కృషి దేశ పురోగతికి దోహదపడుతోందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు కూడా కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande