మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కార్మికులకు ప్రత్యేక తనిఖీలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కార్మికులకు ప్రత్యేక తనిఖీలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కార్మికులకు ప్రత్యేక తనిఖీలు


తిరుపతి, 15 జూన్ (హి.స.)

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మోగురుపల్లి గ్రామ పరిధిలోని శ్రీసిటీలో ఉన్న హైటియన్ కంపెనీలో కార్మికులకు గంజా నిర్ధారణ పరీక్షలు ఈ రోజు సోమవారం ఉదయం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం మరియు కార్మికుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రియాంక ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ మొగలిరెడ్డి, కానిస్టేబుల్ హరి, డ్రైవర్ హరీష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande