
విజయవాడ, 16 జూన్ (హి.స.)ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు. ఆలయ ఈవో శీనానాయక్కు మంగళవారం ఉదయం పట్టుచీరను అందజేశారు. ఇక్కత్ డిజైన్తో మగ్గంపై నేసిన ఈ చీర దాదాపు ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉంటుందని విజయ్కుమార్ తెలిపారు. దీని తయారీకి వారం రోజులు పట్టిందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ