రూ.200 కోట్ల అవినీతి తిమింగలం.. సంచుల్లో భారీగా నోట్ల కట్టలు
రూ.200 కోట్ల అవినీతి తిమింగలం.. సంచుల్లో భారీగా నోట్ల కట్టలు
Acb


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

రాష్ట్రంలో అవినీతి తిమింగలాల

వేటలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి గట్టి దెబ్బ కొట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 విభిన్న ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.

నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ ఈ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత పట్టుబడిన అక్రమ ఆస్తుల పూర్తి వివరాలను, వాటి మార్కెట్ విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

నరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో నారాయణగూడలోని సర్వే భవన్లో, సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచీ సోదాలు చేస్తోన్న అధికారులు.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్ లో ఉన్న బెడ్ కింద రూ.1.10 కోట్ల విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రినాక నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande