ఆదిఫ్నగర్. పోలీసుస్టేషన్.పరిదిలో హిట్ అండ్ రన్ కేసు
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు. ఆదివారం ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది
ఆదిఫ్నగర్. పోలీసుస్టేషన్.పరిదిలో హిట్ అండ్ రన్ కేసు


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు. ఆదివారం ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ యువకుడు సెల్ఫ్ డ్రైవ్కు ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ కారు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 35 ఏళ్ల ఫహీమున్నిస్సా అనే మహిళను ఢీకొట్టింది.

కారు ఢీకొట్టిన వేగానికి తీవ్రగాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ చనిపోయిందని తెలియగానే.. ఆ యువకుడు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫహీమున్నిస్సా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడికి కారు అద్దెకు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి కుమారుడిగా పోలీసులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande