కృష్ణ లంక సీ ఐ నాగరాజును వీ ఆర్ కి పంపించిన అధికారులు
కృష్ణ లంక సీ ఐ నాగరాజును వీ ఆర్ కి పంపించిన అధికారులు
కృష్ణ లంక సీ ఐ నాగరాజును వీ ఆర్ కి పంపించిన అధికారులు


విజయవాడ, 16 జూన్ (హి.స.)

: కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక సీఐగా మురళీకృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పలు పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికృష్ణ మార్కాపురంలో ఉండగా... విజయవాడ కృష్ణలంక పోలీసులు వచ్చి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సీఐ నాగరాజుపై రౌడీషీటర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరగ్గా....ఈ నెల 29న సాయికృష్ణను తమ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande