మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: ములుగు జిల్లా ఎస్పీ
మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: ములుగు జిల్లా ఎస్పీ
Sp


ములుగు, 16 జూన్ (హి.స.)

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఈ నెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా - 2026 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. మంగళవారం వారు జాబ్ మేళాకు జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత కోసం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు యువత పెద్ద ఎత్తున హాజరు అయ్యే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భోజన వసతులు, నీటి వసతులు కల్పించాలని, అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల వారీగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్పీ వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ములుగు ఎమ్మార్వో విజయభాస్కర్, పస్ర సీఐ దయాకర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande