కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలకు వెలుగులు.. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలకు వెలుగులు.. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
Mla


ఖమ్మం, 16 జూన్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ తెలిపారు. మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామంలో టీఎన్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఏడీఏ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వైరా నియోజకవర్గంలో తిమ్మారావుపేట కేంద్రంగా విద్యుత్ శాఖకు సంబంధించిన రెవెన్యూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande