
మహబూబ్నగర్, 16 జూన్ (హి.స.)
స్నేహితుని బర్తే రోజే.. ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రం జాతీయ రహదారిపై జరిగింది. హైదరాబాద్కు చెందిన అఖిల్ అనే యువకుడు, భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని ఇమ్రాన్(23), రాజ (21) స్నేహితులు. సోమవారం అఖిల్ బర్తే ఉండడంతో హైదరాబాద్ నుండి అమిస్తాపూర్ గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి బర్తే వేడుకలు చేసుకుని.. మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ముని రంగస్వామి దేవాలయం వెనకాల జాతీయ రహదారి పక్కన ఉన్న టీ కొట్టు వద్ద టీ తాగి.. తిరిగి భూత్పూర్ వైపు వస్తుండగా పార్కింగ్ లేని చోట డీసీఎం ఆగి ఉండడంతో ఆ డీసీఎంను మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు యువకులు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇమ్రాన్, రాజు అక్కడికి అక్కడే మరణించగా.. అఖిల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు భూత్పూర్ ఎస్సై నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..