జడ్పీ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్.. సూర్యాపేట కలెక్టర్ ఉత్తర్వులు
జడ్పీ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్.. సూర్యాపేట కలెక్టర్ ఉత్తర్వులు
Collector


సూర్యాపేట, 16 జూన్ (హి.స.)

పంచాయతీ కార్యదర్శుల నుంచి

అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పీ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఎస్ కె. మెయినోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శుల నుండి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మెయినోద్దీన్ చేసిన వసూళ్లపై ఎంక్వైరీ చేపట్టగా విచారణలో పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలతో సహా నిజాలు నిరూపితమయ్యాయి. విచారణ నివేదిక ఆధారంగా సదరు సీనియర్ అసిస్టెంట్పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిని సహించేది లేదనేెచ్చరికలతో ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande