జీవీకే గౌతమి పవర్కు హైకోర్టు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత, రూ.లక్ష జరిమానా
జీవీకే గౌతమి పవర్కు హైకోర్టు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత, రూ.లక్ష జరిమానా
High court


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

విద్యుత్ నియంత్రణ కమిషన్లకు

తమ ఉత్తర్వులను అమలు చేసే సర్వాధికారాలు ఉన్నాయని, వాటిని కాదని నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. విద్యుత్ నియంత్రణ కమిషన్లు సివిల్ కోర్టులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే సంస్థలని గుర్తు చేస్తూ.. జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఒక దిగువ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వును అమలు చేయించేందుకు పిటిషన్ ను వసూళ్ల ప్రక్రియగా ఉపయోగించుకోలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవని తేల్చిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. పిటిషనర్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించింది.

ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టుకు ప్రాదేశిక అధికార పరిధి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో ఉన్న సంస్థకు సంబంధించిన అంశాలపై ఇక్కడ పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అంశంపై లోతైన విచారణకు

ఆదేశించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు భారీ క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నప్పటికీ, వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఎందుకు ప్రస్తావించలేదో తేల్చాలని ఆదేశించింది. దీనిపై ఏపీ, తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతను గుర్తించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande