సైబర్ వలపు వల.. కానిస్టేబుల్కే రూ. 24 లక్షల నామం!
సైబర్ వలపు వల.. కానిస్టేబుల్కే రూ. 24 లక్షల నామం!
సైబర్ వలపు వల.. కానిస్టేబుల్కే రూ. 24 లక్షల నామం!


అనంతపురం, 16 జూన్ (హి.స.)సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన పోలీసులే వలపు వాళ్లకు చిక్కి విలవిలలాడుతున్నారు. ఫేస్బుక్లో తలారి సాయి శ్రీ అనే ఐడి నుంచి హాయ్ అని మెసేజ్ వస్తేనే ఓ కానిస్టేబుల్ కేరింతల కొట్టాడ. హాయ్ అంటూ మాటలు కలిపి పీకల్లోతు ప్రేమలో వలపు వల కేటుగాడితో పడిపోయాడు. సైబర్ కేటుగాడికి సర్వం ఇచ్చేశాడు అనంతపురం నగరానికి చెందిన కానిస్టేబుల్. అనంతపురం నగరంలోని తలారి నారాయణస్వామి అనే కానిస్టేబుల్ అర్బన్ డీఎస్పీ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఫేస్బుక్ లో వాల్మీకి సాయిశ్రీ ఐడి నుంచి 'హాయ్' అని మెసెంజర్ ద్వారా సందేశం వచ్చింది. బాధితుడు కానిస్టేబుల్ తలారి నారాయణస్వామి కూడా 'హలో' అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా ఒకరినొకరు పరిచయం పెంచుకుని చాటింగ్ చేసుకునేవారు. ఇలా రెండు నెలలు గడిచిన తర్వాత పీకల్లోతు వ్యామోహంలో దిగారు.

దీన్నే ఆసరాగా తీసుకొని మార్చి లో చాటింగ్ చేస్తూ తనకు అర్జెంటుగా రూ.30 వేలు కావాలని కేటుగాడు అడిగాడు. ఇలా పలమార్లు బాధితుడు కానిస్టేబుల్ తలారి నారాయణస్వామి దాదాపు 24 లక్షల రూపాయలు ఇచ్చాడు అయితే తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడు సరైన సమాధానం లేకపోవడంతో మోసపోయానని కానిస్టేబుల్ నారాయణస్వామి తెలుసుకున్నాడు తాను పంపిన అకౌంట్ నెంబర్ల ద్వారా ధర్మవరం పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తలారి వెంకటేష్ తనతో చాటింగ్ చేశాడని తెలుసుకున్నాడు. తాను మోసపోయానని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ తలారి నారాయణస్వామి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని ఫోర్త్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande