హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరం
తిరుపతి, 16 జూన్ (హి.స.) తిరుపతి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీప
హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరం


తిరుపతి, 16 జూన్ (హి.స.)

తిరుపతి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్ మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళల పట్ల దౌర్జన్యాలకు, అనుచిత తీరుకు వైఎస్సార్సీపీ కేరాఫ్ అడ్రస్గా మారిందని ధ్వజమెత్తారు. గతంలో నారా భువనేశ్వరి గారి లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళను సైతం శాసనసభ సాక్షిగా కించపరిచి మాట్లాడిన చరిత్ర వైసీపీ నేతలదని మండిపడ్డారు.

మహిళలను అవమానించడం, వారిపై అరాచకాలకు పాల్పడటం వల్లే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని, అందుకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కేవలం 11 సీట్లకే పరిమితమైందని ఆమె ఎద్దేవా చేశారు. ఒక దళిత మహిళ స్వశక్తితో, ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి వస్తే, ఆమెను గౌరవించడం విడిచిపెట్టి ‘మేకప్ మంత్రి’ అంటూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. హోంమంత్రి అనిత పై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ను వైఎస్సార్సీపీ అధిష్టానం తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

నాడు నారా భువనేశ్వరి గారిని, నేడు హోంమంత్రి అనిత గారిని కించపరిచిన వైసీపీ నేతలకు మహిళా లోకం క్షమించదు. మహిళల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం వల్లే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. గుడివాడ అమర్నాథ్ ని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. లేనిపక్షంలో వైఎస్సార్సీపీ నేతలకు మహిళలే రోడ్లపై తగిన బుద్ధి చెబుతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande