
అమరావతి, 17 జూన్ (హి.స.)
పశు బీమా పథకం కింద గతంలో ఉన్న 80శాతం బీమా ప్రీమియం రాయితీని 85శాతానికి పెంచి, గత రెండేళ్లలో 60వేల పశువులకు బీమా సౌకర్యం కల్పించినట్లు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు తెలిపారు. పశు నష్టపరిహారం పథకం కింద గత ప్రభుత్వంలోని రూ.110 కోట్ల బకాయిలను పశుపోషకులకు చెల్లించామని మంగళవారం పేర్కొన్నారు. వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల్లో పశువులు చనిపోతే గతంలో ఉన్న రూ.37,500ను రూ.50వేలకు కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. 50శాతం రాయితీపై 31వేల టన్నుల సమీకృత దాణాను పంపిణీ చేశామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ