ఏలూరు లో థార్ గ్యాంగ్ కదలికలను .గుర్తించిన పోలీసులు
ఏలూరు లో థార్ గ్యాంగ్ కదలికలను .గుర్తించిన పోలీసులు
ఏలూరు లో థార్  గ్యాంగ్ కదలికలను .గుర్తించిన పోలీసులు


ఏలూరు, 17 జూన్ (హి.స.)

ఏలూరులో ధార్ గ్యాంగ్ కదలికల్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. కరడుగట్టిన ఈ నేరస్థులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. నాలుగేళ్ల కిందట ఏలూరు శాంతినగర్లోని ఓ ఇంట్లోకి చొరబడేందుకు చెడ్డీ గ్యాంగ్ యత్నించగా స్థానికులు కేకలు వేయడంతో పరారైంది. గత సంవత్సరం పార్దీ గ్యాంగ్ కూడా హల్చల్ చేసింది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ధార్ ముఠా జిల్లాలోకి ప్రవేశించింది. ఏలూరు రైల్వే స్టేషన్లో ముగ్గురు వ్యక్తులు సీసీ ఫుటేజీకి చిక్కారు. ఈ గ్యాంగ్ రాజమహేంద్రవరంలో చోరీకి యత్నించి ఇక్కడికి చేరుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. వారు మినీ బైపాస్, గూడ్స్షెడ్ రోడ్డు తదితర ప్రాంతాల గుండా వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురంలో కూడా ఈ గ్యాంగ్ కదలికల్ని గుర్తించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande