6 0 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి లాసెట్ ప్రవేశ పరీక్షలో 9 వ ర్యాంకు
6 0 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి లాసెట్ ప్రవేశ పరీక్షలో 9 వ ర్యాంకు
6 0 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి లాసెట్ ప్రవేశ పరీక్షలో 9 వ ర్యాంకు


ముదినేపల్లి, 17 జూన్ (హి.స.)

చదవాలన్న తపన, పట్టుదల ఉంటే వయసు అడ్డురాదని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రుకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి నిరూపించారు. బొప్పన నాగమల్లేశ్వరరావు ఇటీవల లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్గా రిటైరయ్యారు. ఆయనకు న్యాయ విద్యపై ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రైవేటుగా లా చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడైనా కోర్కె నెరవేర్చుకోవాలని మూడు సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశానికి... 2026-27 విద్యా సంవత్సరానికి ఏపీలాసెట్ పరీక్షలు రాశారు. ఫలితాలు సోమవారం వెలువడగా వందకు వంద మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో ఆయన రాష్ట్ర స్ధాయిలో 9వ ర్యాంకు సాధించారు. 60 ఏళ్ల వయస్సులో పోటీ పరీక్షలు రాసి, మంచి ర్యాంకు సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande