ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం
ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం
ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం


ఏలూరు, 17 జూన్ (హి.స.)

:జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలోకి సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి లాకర్ పగులగొట్టి రూ.78 లక్షలు అపహరించుకుపోయారు. సెక్యూరిటీ కన్నుగప్పి వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన ఆరుగురు దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న మరో లాకర్లో రూ.75 లక్షలు ఉన్నాయి. ఆ లాకర్ తెరవలేదు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కూరపాటి సాయిరోహిత్ మంగళవారం రాత్రి ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande