
హైదరాబాద్, 17 జూన్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లాలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని గార్ల మండలం దుబ్బగూడెం సమీపంలో మున్నేరు వాగు పై ప్రభుత్వం నిర్మించనున్న పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్ట్ సర్వే పనులను గిరిజనులు అడ్డుకున్నారు. తమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టు ఒప్పుకునేది లేదని,
ప్రభుత్వ తీరును నిరసిస్తూ గిరిజనులు, రైతులు భారీ సంఖ్యలో రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చావనైనా చస్తాము తప్ప మా భూములను వదులుకోబోమని ఈ సందర్భంగా వారు ప్రాజెక్టు సర్వే అధికారులను హెచ్చరించారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు