పంటల మార్పిడితో ఉత్తమ ఫలితాలు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
పంటల మార్పిడితో ఉత్తమ ఫలితాలు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Mla


మిర్యాలగూడ, 17 జూన్ (హి.స.)

వ్యవసాయంలో పంటల మార్పిడి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం వారు పట్టణంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న జీలుగులు, జనుములను బుధవారం రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భూమి సారాన్ని పెంపొందించేందుకు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జీలుగులు, జనుములు వంటి పచ్చిరొట్ట పంటల సాగు ఎంతో ఉపయోగకరమని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారులు రుషేంద్రమణి, నాయకులు పొదిల శ్రీను, బసవయ్య, రవిందర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande