బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ
Shabbir Ali


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

ప్రమాదవశాత్తు గొర్లు మృతి చెంది... సుమారు 14 లక్షల రూపాయలు నష్టపోయిన కుటుంబానికి, ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ భరోసానిచ్చారు. బుధవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కందూరి సాయిలు కు చెందిన 140 గొర్లు చనిపోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం నూరిపోశారు. ఎందుకోసం చనిపోయాయి అంటూ వ్యవసాయ శాఖ అధికారి మోనికా రెడ్డిని ప్రశ్నించగా, ఇక్కడ టెస్టులు చేస్తే విష పదార్థం అని తేలిందని, హైదరాబాద్ ల్యాబ్ కు పంపామని, అక్కడి నుంచి రిపోర్టు ఇప్పుడే వచ్చిందని, ఎందుకనేది ఇంకా స్పష్టంగా తెలియ లేదన్నారు.

దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ కు ఫోన్ చేసి మాట్లాడి, గొర్లు మృతి చెందిన సాయిలు కుటుంబానికి ప్రభుత్వ పక్షాన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం మరికొన్ని గొర్లు ఇప్పుడు అప్పుడు అన్నట్లు ఉన్నాయని, మరిన్ని చనిపోకుండా ఉండేందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా హైదరాబాదు నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో జరిగే సమావేశంలో, ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టిస్తానని ప్రకటించారు. తన వంతు తక్షణ సహాయం గా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. అధైర్యపడవద్దని అన్ని రకాలుగా అండగా నిలబడతానని సాయిలు ను ఓదార్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande