పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
Mla


సంగారెడ్డి, 17 జూన్ (హి.స.)

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీ

పరిధిలో పలు అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఖాజిపల్లి జీఎంఆర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని, త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. జిన్నారంలోని శివాలయ ఆవరణలో తన సొంత నిధులైన రూ.36 లక్షలతో నిర్మించనున్న గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఖాజిపల్లి పరిధిలోని జీఎంఆర్ కాలనీ, జర్నలిస్టు కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ 181లో ప్రజల అవసరాల దృష్ట్యా దేవాలయం, మసీదు, చర్చి, స్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రం, ఛట్ పూజ ఘాట్, క్రీడా మైదానం, ప్రాథమిక పాఠశాల నిర్మాణాల కోసం స్థలాలను కేటాయించి, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టు కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం కాలనీలో గ్రామదేవత ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, గద్దె సుష్మ, తహసీల్దార్ ఆంథోనీ, మాజీ జెడ్పీటీసీ బాల్రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande