భద్రకాళి అమ్మవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్
వరంగల్, 17 జూన్ (హి.స.) వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం దర్శించుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఘనస్వాగతం పలి
Pawan Kalyan


వరంగల్, 17 జూన్ (హి.స.)

వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం దర్శించుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, ఓడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు పవన్. అనంతరం, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ను చూడటానికి వేల సంఖ్యలో భక్తులు, అభిమానులు గుడికి పోటెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande