ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శన
హైదరాబాద్, 17 జూన్ (హి.స.)ప్రెస్ నోట్ రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎస్. శైలజ, సహాయ వ్యవసాయ సంచాలకురాలు శ్రీమతి కె. పద్మజ, వ్యవసాయ అధికారి శ్రీ హరినాథ్, మహేశ్వరం మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. నాగమణిలు ఈ రోజు మహేశ్వరం మండలంలోని మహేశ్
ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శన


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)ప్రెస్ నోట్

రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎస్. శైలజ, సహాయ వ్యవసాయ సంచాలకురాలు శ్రీమతి కె. పద్మజ, వ్యవసాయ అధికారి శ్రీ హరినాథ్, మహేశ్వరం మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. నాగమణిలు ఈ రోజు మహేశ్వరం మండలంలోని మహేశ్వరం ARSK మరియు శ్రీ పద్మావతి ఫెర్టిలైజర్స్ ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (FFS) యాప్ అమలును పరిశీలించి, ఎరువుల విక్రయ విధానాన్ని సమీక్షించారు. ఎరువుల దుకాణాలకు వచ్చిన రైతులతో అధికారులు ప్రత్యక్షంగా మాట్లాడి నూతన యాప్‌పై అవగాహన కల్పించారు.

ఈ యాప్ ద్వారా ఎరువుల నిల్వలు, విక్రయాల పర్యవేక్షణ మరింత పారదర్శకంగా జరుగుతుందని, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని వివరించారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు మరియు డీలర్లకు సహకరించాలని సూచించారు.

జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎస్. శైలజ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఫెర్టిలైజర్ సేల్స్ యాప్ రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరియు సమర్థతను పెంపొందిస్తుందని తెలిపారు.

అదేవిధంగా, డీలర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande