
జగిత్యాల, 17 జూన్ (హి.స.)
పాఠశాలలు పునఃప్రారంభమైన
నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ బస్సులు, ఆటోలను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సుల ఫిట్నెస్, అత్యవసర ద్వారాలు, ఫైర్ ఎక్స్టెంగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, డ్రైవర్ల అర్హతలు తదితర భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. అలాగే పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళుతున్న ఆటోలను గుర్తించి జరిమానాలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, నిబంధనలు పాటించని వాహనాల పై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యాలు, వాహనదారులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..