కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకానికి వేదగిరి నరసింహస్వామి ఆలయం ఎంపిక.
కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకానికి వేదగిరి నరసింహస్వామి ఆలయం ఎంపిక.
కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకానికి వేదగిరి నరసింహస్వామి ఆలయం ఎంపిక.


నెల్లూరు, 17 జూన్ (హి.స.)కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాదం (PRASHAD) పథకానికి నెల్లూరు రూరల్ పరిధిలోని చారిత్రక వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికైంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాదం పథకం తో అభివృద్ధికి వేదగిరి నరసింహస్వామి దేవస్థానం అవకాశం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక దేవాలయం ఇదే కావడం విశేషం.

PMIS పోర్టల్ ద్వారా PRASHAD పథకం కింద ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు ఆహ్వానం పలికారు. కేంద్ర రంగ పథకాలకు 30.09.2026 వరకు తాత్కాలిక పొడిగింపును మంజూరు చేస్తూ... ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ విభాగం జారీ చేసిన g O.M. నం. 42(02)/PF-II/2014 (తేదీ: 23.03.2026)

దీనికి అనుగుణంగా, మంత్రిత్వ శాఖ పరిశీలన కోసం Pilgrimage Rejuvenation and Spiritual Heritage Augmentation Drive (PRASHAD) పథకం కింద కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనలను, ప్రస్తుత పథక మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహ్వానించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. PRASHAD పథకం కింద అభివృద్ధి కోసం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చక్కటి అవకాశం లభించిందని చెప్పారు. ఈ ప్రదేశాల కోసం తాజా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను (DPRs) ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. DPRలను 20 జూన్ 2026 నాటికి సమర్పించాలని సూచనలు చేశారు. .నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకోసం ఆయన రాష్ట్ర, కేంద్ర నాయకుల దృష్టికి అనేక సార్లు ఈ విషయాన్ని తీసుకుని వెళ్లడంతో, ప్రసాదం పథకం కింద వేదగిరి నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి డిపిఆర్ లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రసాదం స్కీం సజావుగా సాగితే వేదగిరి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో రాష్ట్రంలోని నెంబర్ వన్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande