వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్పై తెలుగు మహిళల తీవ్ర ఆగ్రహం!
వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్పై తెలుగు మహిళల తీవ్ర ఆగ్రహం!
వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్పై తెలుగు మహిళల తీవ్ర ఆగ్రహం!


అనంతపురం, 17 జూన్ (హి.స.)మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ తెలుగు మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమర్నాథ్ వైఖరికి నిరసనగా రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతపురం నగరంలోని రాంనగర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.

మాజీ మంత్రి అమర్నాథ్ ఫోటోలపై ‘గుడ్డు మంత్రి’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంతేకాకుండా, ఆయన ఫోటోలపై కోడిగుడ్లతో దాడి చేసి అమర్నాథ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను దహనం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande