కొనుగోలు కేంద్రంలోనే పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
కొనుగోలు కేంద్రంలోనే పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
కొనుగోలు కేంద్రంలోనే పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య


ఆదిలాబాద్ 17 జూన్ (హి.స.)

కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగూరే పాండురంగ్(48) అనే రైతు తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు

హమాలీలకు డబ్బులు చెల్లించిన అనంతరం లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, పది రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande