నంద్యాలలో ‘యోగాంధ్ర-2026’ వేడుకలు
నంద్యాలలో ‘యోగాంధ్ర-2026’ వేడుకలు
నంద్యాలలో ‘యోగాంధ్ర-2026’ వేడుకలు


నంద్యాల, 17 జూన్ (హి.స.)

: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ ధనుంజయ్ జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు. అనంతరం యోగా నిపుణుల సూచనలమేరకుయోగాసనలు ప్రాణాయామం, ధ్యాన సాధన నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాభ్యాసం చేశారు.

యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande