పవన్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. ఏపీకే పరిమితం కావాలని హితవు
పవన్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. ఏపీకే పరిమితం కావాలని హితవు
pawan


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇక్కడి ప్రజల గురించి పవన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాటం, అనేక త్యాగాల ఫలితంగా, సోనియా గాంధీ చొరవతో కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ కల్యాణ్, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పవన్ తన మాటల ద్వారా బీజేపీ అజెండానే అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలపై దృష్టి సారించాలి తప్ప, తెలంగాణ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని పవన్కు సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించే వ్యూహంలో భాగంగానే పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. వారి మధ్య ఏవైనా లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా? అని మహేశ్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande