రైతులు పండించిన గిట్టుబాటు ధర కల్పించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి
అమరావతి, 18 జూన్ (హి.స.) అమరావతి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పొ
రైతులు పండించిన గిట్టుబాటు ధర కల్పించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి


అమరావతి, 18 జూన్ (హి.స.)

అమరావతి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పొగాకు మార్కెట్ పరిస్థితులపై, సంబంధిత రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణపై చర్చించారు సీఎం.

పొగాకు బోర్డు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మామిడి రైతుల సమస్యలు, మార్కెటింగ్ అవకాశాలపై సమీక్షించారు. మామిడి దిగుబడులు, ధరల పరిస్థితులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు ఓ నివేదిక అందజేశారు.

అదే విధంగా ఆక్వా రంగంలో ధరల హెచ్చుతగ్గులపైనా చర్చించారు సీఎం. రొయ్యలు, చేపల రైతుల సమస్యలపై ఈ సమీక్ష సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాచరీల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయం, ఉద్యానవన, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande