
విశాఖ పట్నం, జూన్ 18 (హి.స.)
రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులోని శివ ఫైర్వర్క్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం నుంచి భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదఘటనతో మార్కెట్ రోడ్డులో ట్రాఫ్ జామ్ అయింది. శివ ఫైర్వర్క్స్కు పోలీసుల నుంచి అనుమతి లేదని విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. దీంతో దుకాణ యజమాని కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నట్టు చెప్పారు. జనావాసాలు, వ్యాపారకూడలి వద్ద పేలుడు పదార్థాలు విక్రయించకూడదని, షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ