
అమరావతి, 18 జూన్ (హి.స.)
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లా కేంద్రంతోపాటు నెల్లిమర్ల, గంట్యాడ, జామి, గజపతినగరం దత్తిరాజేరు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఉదయం 9 గంటల సమయంలో వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు, విధులకు హాజరవుతున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ