బాడంగి మండలం వీరవ్సాగరంలో.వాడిన ఇంట్లో మరదలు చోరీ
బాడంగి మండలం వీరవ్సాగరంలో.వాడిన ఇంట్లో మరదలు చోరీ
బాడంగి మండలం వీరవ్సాగరంలో.వాడిన ఇంట్లో మరదలు చోరీ


బొబ్బిలి, , 18 జూన్ (హి.స.)

వదిన ఇంట్లో బంగారు ఆభరణాలను మరదలు చోరీ చేసిన ఘటన బాడంగి మండలం వీరసాగరంలో చోటుచేసుకుంది. 24 గంటల్లో నిందితురాలిని పోలీసులు పట్టుకొని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. వీరసాగరం గ్రామానికి చెందిన జరజాన శంకరరావు, భార్య సుజాత మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లగా పట్టపగలే ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి తన బృందంతో దర్యాప్తు చేపట్టగా సుజాత మరదలు(సోదరుడి భార్య) అయిన విజయరాంపురం గ్రామానికి చెందిన మరడ వసంత దొంగతనానికి పాల్పడినట్లు కనుగొన్నారు. ఆభరణాలను విజయరాంపురం నుంచి వేరో చోటుకు తరలిస్తుండగా పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande