
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
హైదరాబాద్: రైతు భరోసా నిధులను ఈనెల 30న విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్రెడ్డి ( విడుదల చేయనున్నారు. వానా కాలం సాగుకు సంబంధించిన ఈ నిధులను 10 రోజుల్లో జమ చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్లు, వీబీజీ రాంజీ పథకం, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై మంత్రులతో చర్చలు జరిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్