
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
హైదరాబాద్లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
అదే విధంగా తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు